తమకు రక్షణ కరువైందంటున్న డీయూ అధ్యాపకులు
ఘటన జరిగి పది రోజులైనా.. ఏబీవీపీ కార్యకర్తపై చర్యలు శూన్యం
ఆందోళన వ్యక్తం చేస్తున్న టీచర్స్ యూనియన్లు
న్యూఢిల్లీ : ఓ కాలేజీ ప్రొఫెసర్‌ను చెంపదెబ్బ కొట్టిన ఏబీవీపీ సభ్యులు, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) జాయింట్ సెక్రెటరీపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారుతున్నది. ఈ విషయంపై అధ్యాపకులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. సదరు విద్యార్థి నేతపై చర్యలు తీసుకోకపోవడం ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ గ్రూప్స్ తమకు రక్షణ లేకుండా పోయిందని భావిసు న్నాయి. ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌తో పాటు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ కాలేజీకి చెందిన టీచర్లను అవమానపర్చటమే గాక.. ఏబీవీపీకి చెందిన సభ్యులతో కలిసి దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈనెల 16న జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పది రోజులైనా సదరు విద్యార్థి నేతపై చర్యలు తీసుకోకపోవటంపై అందరి లోనూ పలు అనుమానాలు కలుగుతు న్నాయి. కాలేజీల్లో అధ్యాపకులకు భద్రత కరువైందని టీచర్స్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై టీచర్స్ యూనియన్లు తీవ్రంగా స్పందిస్తున్నాయి. బాధ్యులైన సదరు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకునేలా యూని వర్సిటీ, కాలేజీలపై ఒత్తిడి పెంచేందుకు డీయూ టీచర్స్ అసోసియేషన్‌ను కోరుతున్నాయి. దీనికి సంబం ధించి తదుపరి ప్రణాళికను రూపొం దించేందుకు జనరల్ బాడీ మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని కోరాయి. ది డెమోక్రటిక్ టీచర్స్ ఫ్రంట్, ఇండియన్ నేషనల్ టీచర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌టీఈసీ), డెమో క్రటిక్ టీచర్స్ ఇనిషియేటివ్, రాష్ట్రీయ శిక్షా మోర్చా, సమాజ్‌వాదీ శిక్షక్ మంచ్‌లు డీయూ టీచర్స్ యూనియన్‌ను అభ్యర్థించాయి.ప్రొఫెసర్‌పై దాడి ఘటనకు సంబంధించి యూనివర్సిటీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దర్యాప్తు జరిపి రెండు వారాల్లోగా నివేదిక అందిం చాలని ఆదేశించింది. అయితే నిందితులపై ఎఫ్‌ఐఆర్ దాఖలుకు సంబంధించి మాత్రం ఎలాంటి స్పష్టతా లేకపోవటం గమనార్హం. నింది తులపై చర్యలు తీసుకునేవరకూ టీచర్లు తాము సురక్షితంగా ఉన్నామని భావించలేరని ఐఎన్‌టీఈసీ అధ్యక్షులు, రాజధాని కాలేజీ ఫ్యాకల్టీ సభ్యులు పంకజ్ గార్గ్ అన్నారు. వారిపై కొన్ని చర్యలను తప్పక తీసుకోవాలని చెప్పారు. నిందిత ులు సంఫ్‌ు అనుబంధ విద్యార్థి విభాగానికి చెందిన ఏబీవీపీ నాయకులనీ, కేంద్రం, ఢిల్లీలో ఉన్న అధికార బీజేపీ ప్రభుత్వాల పెద్దల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే ఎలాంటి చర్యలకూ ఉపక్రమించటం లేదన్న ఆరోపణలూ విపిస్తున్నాయి.
ప్రొఫెసర్‌పై దాడి చేసిన విద్యార్థి నేతపై చర్యలేవి?
- Advertisement -
- Advertisement -



