Monday, October 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటీజీజీపీఈడబ్ల్యూయూ నూతన కమిటీ ఎన్నిక

టీజీజీపీఈడబ్ల్యూయూ నూతన కమిటీ ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ / గార్ల
మహబూబాబాద్‌ జిల్లా గార్లలోని ఏవీఆర్‌ ఫంక్షన్‌ హల్‌లో(బూడిద అరుణ్‌ గౌడ్‌ నగర్‌) రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటీయూ) 5వ రాష్ట్ర మహాసభల్లో 53 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర అధ్యక్షులుగా ఫైల్ల గణపతి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాలడుగు సుధాకర్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చాగంటి వెంకటయ్య, రాష్ట్ర కోశాధికారిగా తునికి మహేష్‌, రాష్ట్ర మహిళా కన్వీనర్‌గా పొట్ట యాదమ్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గ్యార పాండు, పులి మల్లేష్‌, బండ్ల అప్పిరెడ్డి, రాపర్తి రాజు, మండ్ల రాజు, కొప్పుల శంకర్‌, కె.దశరథ్‌, వెంకటేష్‌గౌడ్‌, బుర్ర శ్రీనివాస్‌గౌడ్‌, పొన్నం అంజయ్య, ఎస్‌. లింగమ్మ, పి. రాధాకృష్ణ, జంగం గంగాధర్‌, కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శులుగా ఆశన్న, పెరిక శ్రీకాంత్‌, కోమటి చంద్రశేఖర్‌, ఎండీ ఖాజా, ఎండీ హుస్సేన్‌, సీహెచ్‌ లక్ష్మీనారాయణ, నకిరేకంటి రామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ కార్మికుల హక్కుల సాధన కోసం రానున్న కాలంలో జీపీ కార్మికులను ఏకం చేసి బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -