టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై మాజీ ఎమ్మెల్యే పుట్టమధు చేస్తున్న కుట్రలపై విచారణ జరిపించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ లింగం యాదవ్ డిమాండ్ చేశారు. మంత్రి ఇమేజ్ డ్యామేజ్ చేయాలని ప్రయత్నించొద్దని హెచ్చరించారు. ఆదివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. పుట్టమధుకు సెటిల్‌మెంట్లు, హత్యలే తప్పా ఆయనకేం తెలుసన్నారు. మంత్రి పేషీ నుంచి తప్పు జరిగినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. శ్రీధర్‌బాబు ఎలాంటి వ్యక్తో, ఆయన వ్యక్తత్వమేంటో కేసీఆర్, కేటీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని సూచించారు. సీబీఐ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మంత్రిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అబద్ధాలు ప్రచారం చేసి ఇదే నిజమనుకుంటే పొరపాటన్నారు. హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపిటల్‌గా మార్చేందుకు శ్రీధర్‌బాబు కారణమనీ, అలాంటి మంత్రిపై ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు.
పుట్ట మధు కుట్రలపై విచారణ జరపాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



