- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్రం ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని క్రమంగా పెంచుతోంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద జీరో ఎమిషన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ 10,900 బస్సుల కోసం వచ్చే నెల 6న బిడ్లను ఓపెన్ చేయనుంది. వీటిల్లో హైదరాబాద్‌కు 2,000, సూరత్ & అహ్మదాబాద్‌కు 1,600, ఢిల్లీకి 2,800, బెంగళూరుకు 4,500 బస్సులను కేటాయించనుంది.
- Advertisement -



