Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీటీరోడ్డు వేసేదాకా రిలే దీక్షలు : సీపీఐ(ఎం)

బీటీరోడ్డు వేసేదాకా రిలే దీక్షలు : సీపీఐ(ఎం)

- Advertisement -


– నిలిచిన బీటీ రోడ్ పనులను వెంటనే ప్రారంభించాలి
– రైతుల పొలాలకు వెళ్లడానికి ఆటంకం లేకుండా రోడ్డు వేయాలి
నవతెలంగాణ – బల్మూరు
మండల కేంద్రం బల్మూరు పోలీస్ స్టేషన్ పక్కనుండి చెన్నారం మీదుగా మహదేవపూర్ వరకు బీటీ రోడ్డు వేసేదాకా రిలే దీక్షలు ఆపేది లేదని హెచ్చరిస్తూ సోమవారం సీపీఐ(ఎం) నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలో సీపీఐ(ఎం), బిఆర్ఎస్, ఆయా ప్రాంత వ్యవసాయ రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఇందుకు మద్దతుగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దేశ్యాయ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పొలాలకు వెళ్లే రైతులచే రిలే దీక్షలు చేస్తున్నామని, అధికారులు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రోడ్డు పని చేయకుండా ఒక రైతు భూస్వామి పొలం నుండి రోడ్డు వేయనీయడం లేదు అంటే ఆపివేయడానికి ఒక్క రైతు కోసం వంద మంది రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇందులో రెవిన్యూ అధికారులు జోక్యం చేసుకొని, నక్ష ప్రకారం బీటి రోడ్డు పనులు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే తీవ్రమైన ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 

ప్రభుత్వ అధికారులు ఈ రోడ్డు మంజూరు చేసేటప్పుడు నక్ష ప్రకారము కొలతలతో మంజూరు చేయలేదా.. మంజూరై డబ్బులు రిలీజ్ అవుతున్న సందర్భంలో ఒక రైతు ఆపితే రోడ్డు ఆపివేయడం ఎంతవరకు సరి అయినది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు రెవిన్యూ ఆర్ అండ్ బి అధికారులు రోడ్డు విషయాన్ని నక్ష ప్రకారము వెంటనే ప్రారంభం చేసి రైతాంగానికి ఆటంకం లేకుండా చూడాలని అన్నారు. రిలే దీక్షలో రైతులు బాలస్వామి, హుస్సేన్ శీను సత్తయ్య బాలయ్య శంకరయ్య దేవయ్యలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఎం శంకర్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ నాగయ్య, గౌస్ సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి బాబర్ ఆంజనేయులు శ్రీరామ్ రైతులు సుల్తాన్, రామకృష్ణ శంకరయ్య రామస్వామి ఆచారి తిరుపతయ్య రాజిరెడ్డి ఈశ్వరయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -