Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పెసర పంటకు వేలం..

పెసర పంటకు వేలం..

- Advertisement -

సింగిల్ విండో సెక్రెటరీ బాబు పటేల్.
నవతెలంగాణ – మద్నూర్
ఈనెల 29న బుధవారం ఉదయం 11 గంటలకు మద్నూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో 48 బస్తాల పెసర పంటకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు మద్నూర్ సింగిల్విండో సెక్రటరీ బాబు పటేల్ సోమవారం నవ తెలంగాణతో తెలిపారు. 2019 సంవత్సరంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో అమ్మటానికి వచ్చిన 48 బస్తాల పెసర పంటకు ఏ ఒక్కరు ముందుకు రాకపోవడం, ఆ పంటకు గతంలో 2019 సంవత్సరంలో జప్తు చేయడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఇప్పటివరకు మార్కెట్ యార్డులో నిలువ ఉంచిన 48 బస్తాల పెసర పంటకు వేలం వేస్తున్నామని తెలిపారు. ఈ వేలం తహశీల్దార్ ఆదేశాల అనుసారంగా జరుగుతోందని తెలిపారు. ఆసక్తిగల కొనుగోలుదారులు పాల్గొనాలని మద్నూర్ సింగిల్ విండో సెక్రెటరీ బాబు పటేల్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -