- Advertisement -
నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
భేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా కల్వకుర్తి పట్టణంలోని సుభాష్ నగర్ అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం అంగన్వాడి ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు ఆడపిల్లల్ని సంరక్షించుకోవడమే కాకుండా, వారిని తప్పక చదివించాలని, కిషోర బాలికల గురించి మరియు మహిళలకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి.11 నుండి 18 సంవత్సరాల పిల్లలకు క్రమశిక్షణగా ఉండాలని ఈ సందర్భంగా అంగన్వాడి ఉద్యోగులు అలివేల సునీత అనిత తదితరులు కోరారు.
- Advertisement -



