పెద్దమందడి ఎమ్మార్వో కు అఖిల పక్ష ఐక్యవేదిక వినతి
నవతెలంగాణ – వనపర్తి
జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు, బి ఎల్ ఓ ల సమస్యలను పరిష్కరించాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లా అధికారులను కోరారు. పెద్దమందడి మండల బి.ఎల్.ఓ ల విన్నపం మేరకు పెద్దమందడి మండలం ఎమ్మార్వో ఆఫీస్ లో జరుగుతున్న బి.ఎల్.ఓ ల సమావేశానికి హాజరై వారి సమస్యలను అడిగి తెలుసుకుందామని తెలిపారు. వారికి రావాల్సిన వేతనాలు వెంటనే ఇప్పించాలన్నారు. వారితో ఇతర పనులు చేయిస్తూ తద్వారా రావలసిన డబ్బులు ఇవ్వడం లేదన్నారు.
మహిళలతో శ్రమ దోపిడీ చేయిస్తూ చేసే పని కాకుండా కలెక్టర్ ఉత్తర్వులంటూ ఇతర పనులు చేయిస్తున్నారని, వాటికి రావాల్సిన డబ్బులు ఇవ్వడంలేదని, వెంటనే ఇవ్వాలని వారి సమస్యలను పరిష్కరించాలని సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాగవరం వెంకటేశ్వర్లు, పెద్దమందడి బి.ఎల్.ఓ లు, అంగన్వాడి టీచర్ లు, వనపర్తి పట్టణ అధ్యక్షుడు రామస్వామి, కొత్తగొల్ల శంకర్, రాజనగరం రవి, శివకుమార్, ఎన్ సురేష్, ఏ ఉదయ్, జి సురేష్, ఎన్ కురుమూర్తి, టీ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడి, బిఎల్ఓ ల సమస్యలు పరిష్కరించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



