ప్రభుత్వ జూనియర్ కళాశాల లో మిడ్ డే మీల్స్ ప్రారంభోత్సవంలో పాయం..
నవతెలంగాణ – మణుగూరు
లైన్స్ క్లబ్ , మరియు జూనియర్ కళాశాల సిబ్బంది కృషి అభినందనీయమని పినపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మణుగూరు నందు లయన్స్ క్లబ్ ఆఫ్ అశ్వాపురం స్టార్స్ లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు విజన్ లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు ల తరఫున కళాశాలలో ప్రతిరోజు భోజనం తెచ్చుకోలేని విద్యార్థుల కొరకు మధ్యాహ్న భోజన పథకాన్ని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు మరియు అడ్మిషన్ల సంఖ్యను పెరిగిందని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి హెచ్ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కళాశాలలో హాజరు శాతం పెంచడానికి విద్యార్థుల ఆకలి తీర్చడానికి లయన్స్ క్లబ్ మరియు కళాశాల బృందం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎన్ సత్య ప్రకాష్, మణుగూరు క్లబ్ చాటర్ ప్రెసిడెంట్ పెళ్లారి శెట్టి హరిబాబు, రీజినల్ చైర్మన్ ముద్దం శెట్టి నాగేశ్వరరావు, మణుగూరు విజన్ ప్రెసిడెంట్ బి సురేష్, సెక్రటరీ కృష్ణ, ట్రెజరర్ వి కిరణ్, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎండి కుర్షిద్,ఇంజనీర్ ఆదిత్యన్, డాక్టర్ కోటేశ్వరరావు, గాజుల రమేష్, డాక్టర్ సమ్మయ్య, డాక్టర్ బి వి సత్యనారాయణ, జి నాగేశ్వరరావు, మరియు కళాశాల సిబ్బంది పుర ప్రముఖులు పాల్గొన్నారు.
లైన్స్ క్లబ్, కళాశాల సిబ్బంది కృషి అభినందనీయం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



