కలెక్టర్ మంత్రిగారులకు వినతులు ఇచ్చిన చర్యలు ఏవీ.?
సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆత్కూరీ శ్రీకాంత్
నవతెలంగాణ – కాటారం
మండలం లోని మేడిపల్లి పరిధిలో ఉన్న టోల్గేట్ యాజమాన్యం అన్యాయంగా ఎటువంటి అనుమతులు లేకుండా ధనార్జనే ధ్యేయంగా కమర్షియల్ బిల్డింగ్ కట్టి అద్వానంగా దోచుకుంటున్నరని కాటారం మండల సీపీఐ(ఎం) కార్యదర్శి అత్కూరి శ్రీకాంత్అ అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…అధికారులలో ఏమాత్రం చలనం లేదని ఎన్నిసార్లు విన్నవించినా, అధికారులకు కూడా స్పందించినటువంటి యాజమాన్యంపై ఇప్పటివరకు చర్యలు లేవన్నారు. కలెక్టర్ గారికి, మంత్రి గారికి వినతి పత్రం అందజేసిన కూడా పట్టించు కోవడం లేదన్నారు. బిల్డింగ్ పైన ఇప్పటివరకు ఏ చిన్న చర్య తీసుకోకపోవడం దేనికి సంకేతము అర్థం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఆ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని కమర్షియల్ బిల్డింగ్ ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో టోల్గేట్ యాజమాన్యంపై అధికారులపై పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని ఆయన హెచ్చరించారు.



