Monday, October 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ హామీలను అమలు చేయండి 

ప్రభుత్వ హామీలను అమలు చేయండి 

- Advertisement -

ప్రజావాణిలో ఐద్వా నాయకుల వినతి 
నవతెలంగాణ – వనపర్తి

ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణి లో జిల్లా కలెక్టర్కు ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ లక్ష్మి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు మహిళలకు 4016 పెన్షన్ ఇవ్వాలని, ప్రతి మహిళకు రూ.2500 లు ఇవ్వాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. పెంచిన పెన్షన్, ప్రతి మహిళకు రూ. 2500 లు ఇవ్వడంలో జాప్యము కొనసాగుతుందన్నారు.

వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో మహిళలందరినీ కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఐద్వా జిల్లా కమిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. 15 ఏళ్ళ నందిని అనే అమ్మాయికి చెవులు వినపడవని, మాటలు కూడా రావడం లేదని పేర్కొన్నారు. ఆమె వినతిపత్రం ఇచ్చిన వెంటనే పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పి కలెక్టర్ హామీ ఇవ్వడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా ఐద్వా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లక్ష్మి పేర్కొన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో భాగ్యమ్మ, మంజుల, జరీనా, నందిని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -