Wednesday, May 14, 2025
Homeఖమ్మంఊట్లపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

ఊట్లపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట: అశ్వారావుపేట మండలం ఊట్లపల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. స్థానిక వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త కే.నాగాంజలి వానాకాలం సాగుకు సమాయత్తం కావటానికి అనుగుణంగా వేసవి దుక్కులు, రసాయనిక ఎరువులు వినియోగం, పంట మార్పిడి, మల్చింగ్ – బిందు సేద్యం అంశాలను వివరించారు. మరో  శాస్త్రవేత్త డాక్టర్ ఎ.కె. సమాయత్తం అనుగుణంగా వేసవి దుక్కులు, రసాయన ఎరువుల వినియోగం, పంట మార్పిడి, మల్చింగ్, డ్రిప్ విధానాన్ని వివరించారు. యాంత్రిక సాగు, వ్యవసాయ వ్యర్థాలతో ఎరువులు తయారీ పై అవగాహన కల్పించారు. అదేవిధంగా రసాయన ఎరువులను సిఫారసు చేసిన మేరకు వినియోగించి నేల సారాన్ని కాపాడాలని మరో శాస్త్రవేత్త పి.ఝాన్సీ రాణి వివరించారు. సేంద్రియ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. విత్తన రశీదులు భద్ర పరుచుకోవాలని తెలిపారు. వ్యవసాయ శాఖ మండల అధికారి శివ ప్రసాద్ మట్టి నమూనాలను సేకరించే పద్దతి గురించి వివరించారు. వ్యవసాయ విస్తరణ అధికారి వ్యవసాయ అభివృద్ధిలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, పురుగు మందులు వాడకంపై అవగాహన కల్పించారు. ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం అశ్వారావుపేట అద్యక్షులు సీ హెచ్. సత్యనారాయణ పచ్చిరొట్ట విత్తనాల సరఫరా, ఎరువులు లభ్యతను తెలిపారు. హార్టికల్చర్ ఆఫీసర్ బి.వేణు మాధవ్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ లో పోషకాలు లేమి, ఎలుకలతో సాగు పై ప్రభావం, వివిధ పండ్ల తోటలకు ప్రభుత్వం అందించే సబ్సిడీపై వివరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి.వినయ్ కుమార్, వ్యవసాయ  విద్యార్థులు నాగలక్ష్మి, విజయ్, వరప్రసాద్, శివప్రసాద్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -