Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆదిలాబాద్ లో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్ లో మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
రైతులు పండించిన ప్రతి పంటలను ప్రభుత్వాలు కొనుగోళు చేస్తాయని రైతులు అధైర్యపడొద్దని ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు. సోమవారం మార్కెట్ యార్డులో మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోళు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ప్రారంభించారు. కంటాకు పూజ చేసి తొలిరైతును సత్కరించి మొక్కజొన్నను తూకం వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ… రైతుల పంటలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళు చేస్తున్నాయన్నారు. రైతులు కూడా నియమనిబంధనలు పాటిస్తు మద్దతు ధరను పొందాలన్నారు. మొక్కను తేమ శాతం నిబంధనతో రూ. 2400తో కొనుగోళు చేయడం జరుగుతుందన్నారు.

మద్య దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వ కొనుగోళు కేంద్రంలోనే విక్రయించాలని సూచించారు. త్వరలోనే సోయ కొనుగోళు కేంద్రాన్ని ఏర్పాటు చేసేల చూస్తామన్నారు. వాతావరణ మార్పుల కారణంగా పత్తిలో తేమ శాతం పెరిగిందని, అయితే రైతులు ఎకరానికి 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుబడి వచ్చే మొక్క జొన్నల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు 2400 రూపాయలు మద్దతు ధర అందించి మొక్కజొన్నలను కొనుగోళు చేస్తుందని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మధ్య దళారులు లేని కారణంగా రైతులు నేరుగా ప్రభుత్వానికి అమ్ముకోవాలన్నారు.

అదే విధంగా సోయా కొనుగోళ్లపై ఇటీవల వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర రావ్ ను కలిసి విన్నవించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద వహించి సోయా కొనుగోళ్లకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామల దేవి, తెలంగాణ విత్తన దృవీకరణ డైరెక్టర్ కేశవులు, వరంగల్ మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్, ఆర్డీఓ స్రవంతి, డీఏఓ శ్రీధర్ స్వామి, మార్కెటింగ్ ఏడీ గజానంద్, కొనుగోలు కేంద్రం ఇన్చార్జి పండరీ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -