Monday, October 27, 2025
E-PAPER
Homeఆదిలాబాద్పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమచేయాలి 

పెండింగ్ పీఎఫ్, ఈఎస్ఐ కార్మికుల ఖాతాల్లో జమచేయాలి 

- Advertisement -

నూతన టెండర్లు పిలవాలి
కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి 
అన్నమొల్ల కిరణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి 
నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్

రిమ్స్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న పీఎఫ్, ఈఎస్ఐ చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. 15 మంది కార్మికులకు వేతనాలు ఖాతాల్లో జమకాలేదని వెంటనే జమచేయాలని సోమవారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ఆసుపత్రుల్లో ఐ హెచ్ ఎఫ్ ఎం ఎస్. టెండర్ల కాల పరిమితి ముగిసింది. వెంటనే నూతన టెండర్లను పిలవాలని ఈ టెండర్లలో కార్మికులందరికీ కనీస వేతనం రూ.26000 చెల్లించాలని డిమాండ్ చేశారు.

కార్మికులందరికీ ఉద్యోగ భద్రత పెన్షన్ సౌకర్యాలను ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న 15 మంది కార్మికుల వేతనాన్ని కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ ని ఖాతాల్లో వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు.. హక్కుల సాధన కోసం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని కార్మిక లోకం పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నూతన టెండర్లు పిలవాలని కనీస వేతనం టూరూ. 26 వేల డిమాండ్ల సాధనకోసం రానున్న రోజుల్లో జరిగే పోరాటాలకు  కార్మికులు అధిక సంఖ్యలో హాజరవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పండుగ పొచ్చన్న, రిమ్స్ సహాయ కార్యదర్శి కే. రమేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -