ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాల్ రాజు..
నవతెలంగాణ – భువనగిరి: కార్మికుల శ్రమను దోచుకోవడానికే కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ లను తీసుకోవచ్చిందని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ యూసుఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్. బాల్ రాజ్ ఆరోపించారు. మంగళవారం ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత కౌన్సిల్ సమావేశం విశ్రాంతి ఉద్యోగుల భవనంలో పిల్లి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చి కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వo చేస్తుందని, వాటిని కార్మికులు ఐక్యంగా పోరాడి తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలి. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అన్నారు. అసంఘటితరంగా కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉపసంహరించుకోవాలన్నారు. స్కీమ్ వర్కర్ లను క్రమబద్ధీకరించాలి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని, ఫ్రీ బస్సుతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోని నెలకు రూ. 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన వంట కార్మికులకు మేనిఫెస్టో లో చెప్పిన ప్రకారం ఇవ్వాలని అన్నారు. కార్మిక-ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్ట సవరణలు ఉపసంహరించుకోవాలనీ, మే-20 న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎం నరసింహ, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు, జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు బోలగాని సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, జిల్లా సహాయ కార్యదర్శులు గనబోయిన వెంకటేష్, ఇంజ హేమలత, సోమన సబిత, కోశాధికారి బీరకాయల మల్లేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, చొప్పరి సత్తయ్య, , పుట్ట రమేష్, లక్ష్మయ్య, అనసూర్య, లక్ష్మి, సంధ్య, నిర్మల పాల్గొన్నారు.
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES