- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి ఎంపీడీవో గా వర్కల వేదవతిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో సోమవారం వేదవతి పాలకుర్తి ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహించిన ఎంపీడీవో కార్యాలయం సూపరిండెంట్ ఎస్ రవీందర్ ఎంపీడీవో బాధ్యతలను వేదవతికి అప్పగించారు. పాలకుర్తి ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించిన వేదవతిని ఇన్చార్జి ఎంపీడీవో ఎస్ రవీందర్ తో పాటు ఏపీఓ అంబాల మంజుల తో పటు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికి, శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -



