Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలేరు మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధుల మంజూరు 

ఆలేరు మున్సిపాలిటీకి అభివృద్ధికి నిధుల మంజూరు 

- Advertisement -

 నవతెలంగాణ – ఆలేరు టౌను 
ఆలేరు మున్సిపాలిటీ అభివృద్ధికి,ఇతర మౌలిక వసతుల కల్పనకు రూ.15 కోట్ల రూపాయలు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భువనగిరి పార్లమెంటు పరిధిలోని, ఆలేరు ,భువనగిరి, తిరుమలగిరి ,మోత్కూర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, యాదగిరిగుట్ట, పోచంపల్లి మున్సిపాలిటీలకు 15 కోట్ల రూపాయల చొప్పున, భువనగిరి ,జనగామ మున్సిపాలిటీలకు 18.75 చొప్పున మొత్తం 142.50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి.

 ఇందులో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఓపెన్ వ్యాయామశాల, పార్కులు, ప్రజల అందించాల్సిన ఇతర మౌలిక వసతుల కల్పన కొరకు నిధులను వెచ్చిస్తారు. ఆలేరు మున్సిపల్ కి గతంలో  అభివృద్ధి పనుల వచ్చిన 15 కోట్ల రూపాయలు  వచ్చాయి. వివిధ రకాల పనుల కొరకు టెండర్లు పిలిచినట్లు మున్సిపల్ అధికారులు తెలియజేశారు.

నిధులు పట్టణ అభివృద్ధి కొరకు వెచ్చిస్తాం: మున్సిపల్ కమిషనర్..బి శ్రీనివాస్ 
ఆలేరు పురపాలక సంఘ అభివృద్ధి కొరకు  గతంలో వచ్చిన పదిహేను కోట్ల రూపాయలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిసి రోడ్ మౌలిక వసతుల కొరకు  టెండర్లు పిలిచాము. త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం  ప్రస్తుతం మంజూరు చేసిన రూ.15 కోట్లతో సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు గ్రీన్ పార్క్, ఓపెన్ జిమ్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. గతంలో మంజూరైన 15 కోట్లు, ప్రస్తుతం మంజూరైన 15 కోట్లతో పట్టణ సుందరీకరణ  పనులు చేపడతాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -