నవతెలంగాణ – ఆలేరు టౌను
జిల్లావ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, ఐకెపి, ఎఫ్ పి ఓ, ప్యాక్స్ సెంటర్ ల లో ధాన్యం కొనుగోలు సందర్భంగా , ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఏ సబితా అన్నారు. ఆలేరు పట్టణంలో సోమవారం వ్యవసాయ మార్కెట్ లో ధాన్యం కొనుగోలుని పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నవతెలంగాణతో సబిత మాట్లాడుతూ.. ఆలేరు, చౌటుప్పల్ ,వలిగొండ, రామన్నపేట, మోత్కూరు మార్కెట్ యార్డ్ పరిధిలలో పి ఏ సి ఎస్ ,ఐ కే పి , ఎఫ్ పి ఓ, ప్యాక్స్, మహిళా సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు.
ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు టార్పాలి న్, వెయిట్ స్కేల్స్, మైయిచర్ మీటర్లు, ప్యాడి క్లీనర్లు మార్కెట్ యార్లలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. బార్ధాన్ సక్రమంగా సరఫరా అవుతుంది అని, రవాణా వ్యవస్థ సక్రమంగా ఉందని చెప్పారు.సంబంధిత మార్కెట్లలో సెక్రెటరీ , సూపర్వైజర్ మార్కెట్ సిబ్బంది రైతులకు అందుబాటులో ఉంటారన్నారు.సమస్యలేమన్నా ఉన్నట్లయితే రైతులు వెంటనే సెక్రటరీ, సూపర్వైజర్, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. రైతులకు మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
రైతులు అరుగాలం కష్టపడి పండించిన పంటను మధ్య దళారీలకు అమ్మి మోసపోకుండా, మార్కెట్ యార్డులలోకి, గ్రామాలలోని కొనుగోలు కేంద్రాల వద్దకు ధాన్యం తీసుకువచ్చి తూకం వేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర గ్రేడ్ వన్ రు, 2389 , గ్రేటు 2369 రూపాయలు పొందాలని సూచించారు. ధాన్యాన్ని తేమశాతం లేకుండా, ఆరబెట్టుకొని మార్కెట్కు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ సెక్రటరీ పద్మజ, సూపర్వైజర్ శ్రీనివాస్, మార్కెట్ సిబ్బంది, అమాలి కార్మికులు, రైతులు పాల్గొన్నారు.



