Tuesday, October 28, 2025
E-PAPER
Homeఆదిలాబాద్అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసం

అమ్మాయి గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసం

- Advertisement -

సూర్యాపేట వద్ద ముగ్గురు అరెస్ట్
లక్షన్నర నగదు, మొబైల్స్ ఫోన్స్ స్వాధీనం 
కేసు వివరాలు వెల్లడించిన డీఎస్పీ
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్

అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన ఎం లక్ష్మీకాంత్ ఫిర్యాదు మేరకు ఈనెల 25వ తేదీన కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. బాధితుడు తన వివాహానికై ఆన్లైన్ లో యుట్యూబ్ లో వివాహ వధువుల కొరకై శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ లో రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమై కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు.

ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలని తన ఆస్తులు కోర్టు లో చిక్కుకురాయని నమ్మబలికి, లాయర్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా వారి వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు పూర్తిగా చూసుకోవాలి అని చెప్పి, అతని వద్దనుండి విడతలవారీగా రూ.ఎనిమిది లక్షలను మోసం చేసి తస్కరించడం జరిగిందని వెల్లడించారు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మించడం నమ్మించాడు.

ఈ సందర్భంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసంలో పడిన బాధితుడు తనకు విడతల వారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోవడం జరిగిందని 1930 ద్వారా సైబర్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఎస్పీ అఖిల్ మహాజన ప్రత్యేక ఆదేశాల మేరకు, సైబర్ సెల్ వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లా వద్ద నుండి ఏ1 మాలోత్ మంజి, ఏ2 బుక్య గణేష్, ఏ3 రూపవత్ శ్రావణ్ కుమార్ ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మీరు వద్దనుండి ఒకటిన్నర లక్షల నగదు, మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో డబ్ల్యుపీఎస్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ.రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -