నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ ఐసీడిఎస్ అర్బన్ ప్రాజెక్టులో గ్రేడ్ ఒన్ సూపర్వైజర్ గా ఐటిపాముల నిహారిక సోమవారం ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమతకు నియామాక పత్రాన్ని అందజేసీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖలో భర్తీ చేసేందుకు టీజీపిఎస్సీ ప్రత్యేక రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించి, శాఖకుp అప్పగించగా నల్లగొండ జిల్లాకు 11 మందిని రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఆయా ప్రాజెక్టులకు కేటాయించారు. ఈ సందర్బంగా పిఓ మమత మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలో ఒక సూపర్వైజర్ పోస్టు ఖాళీగా ఉండేనని ఆమె తెలిపారు. ప్రస్తుత నియామకంతో సరిపోను సూపర్ వైజర్లు ఉన్నారన్నారు. అదేవిదంగా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ పోస్టుల ఖాళీలు ప్రభుత్వానికి నివేదించి ఉన్నామని ఆమె తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోనాణ్యమైన గుడ్లు, పాలు, బాలామృతం, భోజనం, పౌష్టిక ఆహారమందిస్తున్నామని తెలిపారు. నాణ్యత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సూపర్వైజర్ గా ఐటిపాముల నిహారిక బాధ్యతలు స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



