Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి 

హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి 

- Advertisement -

ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలో తుమ్మల వీరారెడ్డి 
నవతెలంగాణ – మిర్యాలగూడ 

ఆల్ హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని యాదగిరి పల్లి గ్రామంలో ఎస్ ఎన్ డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో పనిచేసే హమాలీ కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని పని ప్రదేశాలలో వారితో శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. హమాలీలకు ఏ రకమైన చట్టాలు వర్తించకపోవడంతో యాజమాన్యాలు, పాలకులు హమాలీలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని  ధ్వజమెత్తారు.

ఎన్నికల ముందు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని అధికారులోకి వచ్చి రెండు ఏళ్లు దాటుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వెంటనే హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆసియా ఖండంలోనే అగ్రగామిగా నిలిచిన మిర్యాలగూడ రైస్ ఇండస్ట్రీలో వలస కార్మికులు దుర్భర జీవితం గడుపుతున్నారని రైస్ మిల్లుల వద్ద షెడ్యూల్ ఏర్పాటు చేసి కనీస సౌకర్యాలు కల్పించకుండా వారికి ఇబ్బందులు గురిచేస్తున్నారని విమర్శించారు. దాని ఫలితంగా వలస కార్మికులు అనారోగ్యాల పాలవుతున్నారని చెప్పారు. రైస్ మిల్లులలో పనిచేసే హమాలీలతో పాటు ఇతర రంగాలలో పనిచేసే హమాలీలకు సమగ్రత చట్టం చేసి అమలు చేయాలన్నారు. 

అదేవిధంగా ఐకేపీలలో పనిచేసే హమాలీ కార్మికులకు కూలి రేట్లు గిట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రైతుల నుంచి కూలీ రెట్లు ఇప్పించకుండా ప్రభుత్వమే నేరుగా రైతులకు వేతనాలు అందజేయాలన్నారు. హమాలీలకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని రంగాల్లో పనిచేసే హమాలీ కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డబ్బికార్ మల్లేష్, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శలు ఎండి సలీం, దండేపల్లి సత్తయ్య, హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు తిరుపతి రామ్మూర్తి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, అవుత సైదులు నల్ల వెంకటయ్య కానుగు లింగస్వామి భీమ గాని గణేష్ హమలి కార్మికుల సంఘం నాయకులు రెడ్యా నాయక్, కత్తుల యాదయ్య, పల్లె నగేష్, వెంబడి వెంకన్న, గుణగంటి రామచంద్రు , బధ్యానాయక్, తాడ్వాయి రాములు, బుర్రయ్య, ఓ యాదగిరి ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -