– సబ్ కలెక్టర్ నారాయణ అమిత్
నవతెలంగాణ – మిర్యాలగూడ
మిర్యాలగూడ మండలంలోని చింతపల్లిలో గల రేషన్ దుకాణం(జనరల్), అడవిదేవులపల్లిలో బాల్నేపల్లి గ్రామంలో గల రేషన్ దుకాణం(బీసీ జనరల్)లో ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ల ఎంపికకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ తెలిపారు. 18 నుంచి 40 సంవత్సరాలు కలిగి నవారు, పదవ తరగతి ఉత్తీర్ణత ఆపైనా విద్యార్హతలు కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లను, కులం, ప్రాంతీయ దృవీకరణ పత్రాలు గెజిటెడ్ అధికారిచే అటెస్ట్ చేయించి మూడు కలర్ ఫోటోలతో వచ్చే నెల 6లోపు సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు 80 మార్కులతో వాత్ర పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉత్తీర్ణ పొందిన వారికి రేషన్ డీలర్గా నియామక ఉత్తర్వులు అందిస్తామన్నారు.
రేషన్ దుకాణ డీలర్ల ఎంపికకై దరఖాస్తుల ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



