- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలో పెంచికలపహాడ్ గ్రామ అభ్యుదయ రైతు ఎల్లయ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల స్టాల్ ను జిల్లా వ్యవసాయ అధికారి పి వెంకటరమణ రెడ్డి, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్తలు, డాక్టర్ డి శ్రీలత, డాక్టర్ బి అనిల్ కుమార్ లు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభ్యుదయ రైతు పండించిన పంటలను ఆసక్తిగా తిలకించినట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన, విస్తరణ సలహా మండలి సభ్యులు యాదగిరి, అభ్యుదయ రైతులు-కంచి మల్లయ్య, సిద్ధారెడ్డి, కరుణాకర్, బిక్షపతి, సోమిరెడ్డి లు పాల్గొన్నారు.
- Advertisement -



