దేవన్ హీరోగా, ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నేచురల్ లవ్ స్టోరీ ‘కష్ణ లీల’. ‘తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకష్ణన్ హీరోయిన్. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్ పై జ్యోత్స్న జి నిర్మిస్తున్నారు. సోమవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాజీ సిబిఐ జే.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ,’ చాలా ప్యాషన్‌తో వర్క్ చేస్తున్న దేవన్‌కి మంచి విజయం దక్కాలని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘అనిల్ చాలా అద్భుతంగా ఈ స్టోరీని రాశారు. చాలా పాజిటివ్‌గా ఉంది. నిర్మాత జోష్ణకి బెస్ట్ విషెస్. దేవన్ హీరోగా, డైరెక్టర్‌గా వస్తున్నారు. చాలా ప్యాషన్‌తో తీశారు. తప్పకుండా సినిమాకి మంచి పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది’ అని నిర్మాత సురేష్ బాబు చెప్పారు.
హీరో దేవన్ మాట్లాడుతూ, ‘హానెస్ట్‌గా సినిమా తీస్తే అందరూ సపోర్ట్ చేస్తారని మా ‘కష్ణ లీల’ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఇది ఒక అందమైన లవ్ స్టోరీ. ప్రేమంటే ఒక త్యాగం, ప్రేమంటే ఒక యుద్ధం. మనం ప్రేమించిన వారి కోసం మనం ఎంత దూరం వెళ్తాం?, ఏ స్థాయి వరకు వెళ్తామనేది అసలైన ప్రేమ. చివరిగా ప్రేమను గెలిపించడమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమని ఇందులో చాలా అద్భుతంగా, థ్రిల్లింగ్‌గా చూపించాం’ అని తెలిపారు.
‘చాలా సిన్సియర్‌గా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీశారు. దేవన్ చాలా హార్డ్‌వర్క్‌తో ఈ ప్రాజెక్ట్‌ని మీ ముందుకు తీసుకు వస్తున్నాడు’ అని హీరోయిన్ ధన్య బాలకష్ణ చెప్పారు.
నిర్మాత జోష్నా మాట్లాడుతూ, ‘దేవన్ చాలా అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ధన్య చాలా చక్కగా నటించారు’ అని అన్నారు. ‘ఇందులో ప్రేమ కథ రెగ్యులర్ ఫార్మేట్‌లో కాకుండా చాలా కొత్తగా ఉంటుంది. ఈ జనరేషన్ పై చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది’ అని రైటర్ అనిల్ కిరణ్ చెప్పారు.
అందమైన ప్రేమకథ..
- Advertisement -
- Advertisement -



