హీరో నాగ శౌర్య నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బారు కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించారు. తాజాగా ‘అందమైన ఫిగరు నువ్వా..’ సాంగ్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్‌గా కంపోజ్ చేశారు. కష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు.
శ్రీధర్ సేన, ప్రియా జెర్సన్ వోకల్స్ మరింత మెలోడీని యాడ్ చేశాయి. సాంగ్‌లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరి పోయింది. ఈ సాంగ్‌కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి ఏర్పడింది అని చిత్రయూనిట్ తెలిపింది.
సముద్రఖని, నరేష్ వీకే, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజరుకుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పథ్వీ, అజరు, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ : రసూల్ ఎల్లోర్, ఆర్ట్: రామాంజనేయులు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్- సుప్రీమ్ సుందర్, పధ్వి, ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శంకర్.
‘డే టైమ్ డెవిల్ నువ్వా.’.
- Advertisement -
- Advertisement -



