Tuesday, October 28, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఅమెరికా యుద్ధాలు-ప్రతిఘటనా ఉద్యమాలు

అమెరికా యుద్ధాలు-ప్రతిఘటనా ఉద్యమాలు

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా అమెరికా దాని మిత్ర దేశాలు సామ్రాజ్యవాద దురాహంకారంతో రెండు రకాల యుద్ధాలు చేస్తున్నాయి. ఒకటి మిలటరీ, రెండు సుంకాలు. ఒకటి రక్తపాతాన్ని, మరణహోమాన్ని సష్టిస్తే, మరొకటి ఆర్థికంగా దెబ్బతీసి లొంగదీసుకునే పద్ధతి. సుంకాల పేరిట ప్రారం భించిన ఈ వాణిజ్య యుద్ధమే నేడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నది.
ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. 2008 నుండి ఇది కొనసాగుతోంది. నేడు మరింత విశ్వ రూపం దాల్చింది. 2025 ఐఎంఎఫ్‌ రిపోర్టు ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా సగటు అభివద్ధి 3.2 శాతం వద్ద ఉంది. అమెరికా గ్రోత్‌ రేటు రెండుశాతానికి పడిపోయింది. ఇతర సామ్రాజ్యవాద దేశాల్లో ప్రధానంగా జర్మనీ 0.2శాతం యూకే 1.3శాతం, ఫ్రెంచి 0.7శాతం, జపాన్‌ 1.1శాతం చొప్పున స్తబ్దంగా ఉన్నాయి. మరోవైపు చైనా, ఇండియా ఇం దుకు మినహాయింపు. చైనా గ్రోత్‌ రేటు 4.8శాతం, ఇండియా గ్రోత్‌ రేట్‌ 6.6శాతం. ఆఫ్రికన్‌ కంట్రీస్‌ లో కూడా వెనకబడ్డ దేశాలు బాగా ముందుకు వెళుతున్నాయి. అందులో సౌత్‌ సుడన్‌ 27.2శాతం, గుహన 14.4, లిబియా 13.7, సేనిగల్‌ 19.3, పలావు 8.5 శాతంగా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం గా అమెరికా దాని మిత్రదేశాలు తీవ్ర ఆర్థిక సంక్షో భంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆర్థిక అసమాన తలు, అసంతప్తి పెరిగిపోయాయి. ఆ దేశాల్లో నివసిస్తున్న వలస దారులపై దాడులు పెరుగుతు న్నాయి.
ముఖ్యంగా భారత ప్రజలపై అమెరికా. ఆస్ట్రేలియా, యూకే దేశాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. 2024 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది వేలమంది వలసదారులు ఈ దాడుల వల్ల చనిపోయారు. సంక్షోభానికి పరాష్టకాష్టగా దీన్ని పేర్కొనవచ్చు. సామ్రాజ్యవాద దేశాలు అంతర్గతంగా తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటాన్నాయి. ఉన్నాయి. రాజకీయంగా ఆర్థికంగా సాంస్కతికంగా సామాజిక రంగాల్లో ఈ సంక్షోభాలు పెరుగుతున్నాయి. అమెరికా వీటి నుండి బయటపడడం కోసం అభివద్ధి చెందుతున్న దేశాల్లోని వనరులను కొల్లగొట్టడం కోసం డైరెక్ట్‌గా మిలిటరీ ద్వారా దాడులు చేయడం, చేయించడం మరోవైపున సుంకల పేరిట వాణిజ్య యుద్ధం ద్వారా లొంగతీసుకొని తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేటువంటి మార్గాలను ఎంచుకుంటున్నది. ట్రంపు ప్రభుత్వం ఈ రెండు రకాలుగా దండెత్తుతున్నది.
అమెరికాలో ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘర్షణలు యుద్ధాలను పరిశీలిస్తే 36 దేశాల్లో 61 ఘర్షణలు జరిగాయి. వాటిలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నాటో కూటమి ప్రయో జనాల కోసం ఉక్రెయిన్‌ రష్యా మధ్య యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నది. యుద్ధంలో ఇప్పటివరకు రష్యా సైనికులు 3,32,000 మంది, ఉక్రెయిన్‌ మిలిటరీ ఏడు లక్షల మంది వరకు మరణాలు లేదా తీవ్రంగా గాయపడటం జరిగింది. పౌరులు 41,700 మంది చనిపోయారు. మరోవైపు పాలస్తీనా (గాజా) పైన ఇజ్రాయిల్‌ దాడుల వల్ల ఇప్పటివరకు 67వేల మంది మృత్యుబారిన పడ్డారు. 1,70,000 మంది గాయపడ్డారు. వీరిలో అత్యధిక మహిళలు, పిల్లలు ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు పెరగడంతో ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. రువాండా- కాంగో, థాయిలాండ్‌ – కంబోడియా, ఆర్మీనియా -అజర్బైజాన్‌, ఈజిప్టు- ఇథోపియా, సెర్బియా – కోసాఓ, భారత్‌ – పాక్‌, ఈ మధ్య పాక్‌ – ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఘర్షణలు కూడా అమెరికా ఉపయోగించుకున్నది. ఇజ్రాయిల్‌ ఆసరాగా చేసుకొని ఇరాన్‌, లెబనాన్‌, సిరియా, ఖాతార్ల మీద కూడా దాడులు చేయించింది. ఇవన్నీ కూడా సహజ వనరులు చమురు, ఖనిజాల దోపిడీ కోసం, ఆధిపత్యం కోసం చేసిన ఘర్షణలు, యుద్ధాలే.
మరోవైపున అమెరికా ఆర్థిక సంక్షోభం నుండి గట్టెక్కడం కోసం తమ దేశానికి దిగుమతయ్యే సరుకుల పైన అత్యధికంగా సుంకలు విధించింది. ముఖ్యంగా ట్రంప్‌ మోడీ స్నేహితులుగా చెప్పుకుంటున్న మన దేశం పైనే 50, 100శాతాల చొప్పున వివిధ సరుకుల పైన ఏకపక్షంగా సుంకాలు విధించింది. ఈ సుంకాల ప్రభావం మన దేశంలోని ఉత్పత్తి రం గాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, గార్మెంట్స్‌, ఆక్వా, ఆటోమొబైల్‌ జూవెలరీతో పాటు అగ్రికల్చర్‌ తీవ్రంగా దెబ్బతిని, ఎగుమతులు ఆగిపోయి, ఉత్పత్తి కుంటుపడి, మన కార్మికుల ఉపాధి పైన ప్రభావం చూపి నిరుద్యోగ సమస్య పెరగడానికి దోహదపడుతుంది.
ప్రధానంగా ఫార్మా రంగంపై 100శాతం టారిఫ్‌ల వల్ల మన తెలంగాణ హైదరాబాద్‌ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. మన దేశం నుండి అమెరికాకు ఎగుమతి ఉత్పత్తులలో ఫార్మా ఉత్పత్తుల ప్రధానంగా ఉన్నాయి. ఇందులో బ్రాండెడ్‌, పేటెంట్‌ డ్రగ్స్‌ పైన వందశాతం సుంకాలు విధించింది. ఫార్మా కంపెనీలైన జైడాస్‌, రెడ్డిస్‌, లూపీన్‌, అరబిందో, ఏటిరో, నాట్కో, ఎమ్మెస్‌న్‌, గ్రాండ్‌ ఫార్మ మైలన్‌ లాంటివి 50శాతం అమెరికా వాటా కలిగి ఉన్నాయి.ఇవన్నీ హైదరాబాద్‌ చుట్టు ఉత్పత్తి చేస్తున్నాయి. 40 నుంచి 54 శాతం ఆదాయం పొందుతున్నాయి. 2024 సం|| లో 12.73 బిలియన్‌ డాలర్ల విలువగల ఫార్మా ఉత్పత్తిలను ఎగుమతులు చేశారు. ప్రస్తుతానికి జనరిక్‌ మందులపై టారిఫ్‌ పెంచకపోయిన భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, గుజరాత్‌, ఉత్తర ప్రదేశ్‌ లో 40 శాతం ఎగుమతుల వాటా కలిగి ఉన్నాయి. ఈ టరీఫ్‌ వల్ల ఈ ఆరు రాష్ట్రాల్లో ఉన్న 35 లక్షల మంది ఉద్యోగులలో 1,86000 నుండి 2,79,000 మంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యే కంగా ఏడు నుండి 10 శాతం అంటే సుమారు 50 నుండి 70వేల మంది ఉద్యోగాలు కోల్పోతారు. ఫలితంగా మన రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య కూడా తీవ్రంగా అవుతుంది. ఒక ఫార్మా రంగమే కాదు టెక్స్‌టైల్స్‌, గార్మేట్సు, ఆటో మొబైల్స్‌, జూవెలరీ రంగాలు తీవ్ర ప్రభావం చూపి మన ఎగుమతులు దెబ్బతిని రాష్ట్ర, దేశ ఆర్థిక పరిస్థితిపైన ప్రభావం పడుతుంది. అయినా బీజేపీ నాయకత్వంలోని మోడీ ప్రభుత్వం ప్రతిఘటించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ట్రంప్‌ ముందు సాగిలపడింది.
అమెరికా భారత్‌పై అక్కసు పెంచుకోడానికి మరో కారణమేమిటంటే మన దేశానికీ చేసే ఎగుమతుల మీద సుంకాలు తక్కువ ఉన్నాయని. అలాగే 2024-25 సంవత్సరంలో మొత్తం 820.93 బిలియన్‌ డాలర్ల విలువగల సరుకులను మనం అమెరికాకు ఎగుమతి చేశాం. అంటే మొత్తం ఎగుమతుల్లో 17.9శాతం. ఇందులో ఫార్మా రంగమే 10 బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులు ఉంటాయి. వీటిపైన సుంకలు పెంచి దారికి తెచ్చుకోవాలన్న పన్నాగం. మన ఎగుమతులు ఆ తర్వాతి స్థానాల్లో చూస్తే యునైటెడ్‌ అరబ్‌ ఏమరేట్స్‌ 8.23, నెదర్లాండ్స్‌5.16, చైనా3.85, సింగపూర్‌3.33, యూకే 3.00శాతం ఉన్నాయి.150 కోట్ల జనాభాతో అత్యధికంగా మార్కెట్‌ కలిగిన దేశం మనది. చైనాను ఢకొీట్టలేక భారత్‌ని లొంగదీసుకోవడం కోసం అమెరికా మన మార్కెట్‌ను, వనరులను కబ్జా చేయడం కోసం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే మన భారత పాలకవర్గాలు అమెరికా ప్రయోజనాలతో పాటు బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను మార్చిన విషయం కూడా తెలిసిందే. అలాగే వ్యవసాయ రంగాన్ని కూడా వారికి అప్పగించడం కోసం మూడు నల్ల చట్టాలు తెచ్చిన పరిస్థితి చూశాం. తమ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడం కోసం అమెరికా చేస్తున్న పన్నాగాలకు కార్మికవర్గం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఘటిస్తున్నది. చైనా, రష్యా లాంటి దేశాలు భారత్‌కు సహకారంతో పాటు అనేక రూపాలుగా ఉపయోగపడుతున్న నేపథ్యంలో అమెరికాకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలి. ప్రపంచవ్యాప్తంగా మన మార్కెట్‌ విస్తరించుకోవడం, మన కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడుకోవడం మన ముందున్న తక్షణ కర్తవ్యం.
భూపాల్‌
9490098034

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -