– మెదక్ జిల్లా కొల్చారం లోతు వాగు వద్ద ఘటన
నవతెలంగాణ-కొల్చారం
మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రం లోతువాగు ప్రాంతంలో నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతి వేగంగా గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. దాంతో 15 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపి దిగిపోగా, సంఘటనా స్థలంలో కొంతసేపు ఆందోళన నెలకొంది. రోడ్డు మధ్యలో మృత్యువాత పడిన గొర్రెలు, గాయపడినవి పడి ఉండటంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ప్రయాణికులు, స్థానికులు సంఘటన చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న కొల్చారం పోలీసులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. మృతి చెందిన గొర్రెల యజమాని ఆ దృశ్యం చూసి బోరున విలపించాడు. మహబూబ్‌నగర్ నుంచి బతుకుదెరువు కోసం గొర్రెలు మేపడానికి వస్తే అవి మృత్యువాత పడ్డాయని కన్నీటి పర్యంతమయ్యాడు.
ఆర్టీసీ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృత్యువాత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



