క్యూ2లో రూ.7,610.45 కోట్ల మిగులు
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ బంఫర్ లాభాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 40 రెట్లు (4,120 శాతం) వృద్ధితో రూ.7,610.45 కోట్ల నికర లాభాలు సాధించింది. రిఫైనింగ్ మార్జిన్లు పెరగడం, అంతర్జాతీయంగా చమురు ధరల్లో తగ్గుదల కంపెనీ ఆర్థిక ఫలితాలకు ప్రధాన మద్దతును అందించాయి. 2024-25 ఇదే సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.180 కోట్ల లాభాలను ప్రకటించింది. 2025-26 ప్రథమార్థంలో కంపెనీ సగటు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 55 శాతం పైగా పెరిగి 6.32 డాలర్లుగా నమోదయ్యిందని తెలిపింది. 2024-25 ప్రథమార్థంలో ఇది 4.08 డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో రిఫైనరీ లాభాలు కేవలం రూ.180 కోట్లుగా ఉన్నాయి. గడిచిన క్యూ2లో కంపెనీ రిఫైనరీ రెవెన్యూ 4.07 శాతం పెరిగి రూ.2.04 లక్షల కోట్లకు చేరింది. దేశీయ చమురు అమ్మకాలు 4.2 శాతం పెరిగి 22,851 మిలియన్ మెట్రిక్ టన్నులుగా చోటు చేసుకుంది. మంగళవారం బిఎస్‌ఇలో ఇండియన్ ఆయిల్ సేర్ 3.19 శాతం పెరిగి రూ.155.15 వద్ద ముగిసింది.
పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ లాభాల్లో 24 శాతం వృద్ధి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-25 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 24 శాతం వృద్ధితో రూ.582 కోట్ల నికర లాభాలు సాధించింది,. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.470 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.1,880 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ2లో రూ.2,131 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,017 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,780 కోట్ల ఎన్‌ఐఐ చోటు చేసుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 1.24 శాతం నుంచి 1.04 శాతానికి తగ్గాయి.
ఇండియన్ ఆయిల్ లాభాల్లో 40 రెట్ల వృద్ధి
- Advertisement -
- Advertisement -



