నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ‘జమ్తారా 2’ వెబ్‌సిరీస్‌తో గుర్తింపు పొందిన యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన అక్టోబర్ 23న జరగగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన చిన్న వయసులోనే బలవన్మరణానికి పాల్పడటం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ఉందిర్‌ఖేడ్‌లో ఉన్న తన నివాసంలో అక్టోబర్ 23న సచిన్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఆయన తుదిశ్వాస విడిచారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సచిన్, నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ‘జమ్తారా 2’ వెబ్‌సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ఆయన ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ నటుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



