నవతెలంగాణ- నిజామాబాద్ సిటీ
నవంబర్ 04 న స్థానిక న్యూ అంబేద్కర్ భవన్ లో యువతకు పలు అంశాలలో పోటీలు నిర్వహించనున్నమని జిల్లా యువజన , క్రీడల అధికారి బి. వవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైరెక్టర్ అఫ్ యూత్ సర్వీసెస్, సికింద్రాబాద్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ అనుమతితో జానపద నృత్యం (బృందం), జానపద గీతాలు (బృందం) , కథ రచన , పెయింటింగ్, డిక్లమేషన్ (వక్తృత్వ పోటి), కవిత్వ రచన, ఇన్నోవేషన్ (ఎక్సిబిషన్ అఫ్ సైన్స్ మేళ) జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమములో పాల్గొనువారు 15 సం. నుండి 29 సం. ల లోపు వారై నిజామాబాద్ జిల్లా వాసులై ఉండవలెను అని తెలిపారు.
జిల్లా స్థాయి పోటిలలో ప్రథమ స్థానం సాధించిన యువతి యువకులు నవంబర్ నెలలో రాష్ట్ర స్థాయిలో జరిగే యువజనోత్సవ పోటిలకు పంపబడును అని , రాష్ట్ర స్థాయి యువజనోత్సవ పోటిలలో ప్రథమ స్థానం సాదించిన యువతి యువకులకు 2026 జనవరి 10 నుండి 12 వరకు న్యూ ఢిల్లీ లో జరుగే జాతీయ స్థాయి యువజనోత్సవ పోటిలకు పంపబడును అని అన్నారు. ఈ పోటిలలో పాల్గొనే కళాకారులు నవంబర్ 03 వరకు, మెయిల్ dysonizamabad@gmail.com లో లేదా ఈ వాట్స్ అప్ నెంబర్ 9701177144, 9959649574 లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. లేనియెడల ఈనెల 04 న 2 కలర్ ఫోటోలు , ఆధార్ కార్డు లేదా పుట్టిన తేది తెలుపు సర్టిఫికేట్ కాపీ తో పోటిలలో పాల్గొనవచ్చు అని వివరించారు.



