Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్'లా' స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలి 

‘లా’ స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఇవ్వాలి 

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
తెలంగాణ యూనివర్సిటీ లా స్పాట్ అడ్మిషన్లు నిర్వహణ కై అనుమతి ఇవ్వాలని  తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ అన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ ఉన్నత విద్యా శాఖ మండలి చైర్మన్ కృష్ణారెడ్డి కి  తెలంగాణ యూనివర్సిటీలోని ఖాళీగా ఉన్న లా సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రామావత్ లాల్ సింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న లా అడ్మిషన్లను భర్తీ చేయడంతో నిజామాబాద్ జిల్లా గ్రామీణ ప్రాంతంలో లా చదువుకునే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని అన్నారు. దీనికి ఉన్నత విద్యా శాఖ మండల చైర్మన్ సానుకూలంగా స్పందించి విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -