నవతెలంగాణ-హైదరాబాద్: 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షల మంది పింఛనుదారుల ఉద్యోగుల జీతాల నిర్మాణం, పదవీ విరమణ అనంతరం వారు పొందే ప్రయోజనాలను నిర్ణయిస్తుంటుంది.
అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంత మేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026తో ముగుస్తోంది. ఈ కమిషన్‌లో ఒక చైర్‌పర్సన్, తాత్కాలిక సభ్యుడు మరియు ఒక సభ్య కార్యదర్శి ఉంటారు.



