Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీటీ రోడ్డుకు తహశీల్దార్ హామీ: రిలే దీక్ష విరమణ 

బీటీ రోడ్డుకు తహశీల్దార్ హామీ: రిలే దీక్ష విరమణ 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు 
15 రోజులలో బీటీ రోడ్డు వేసేటట్లుగా చర్యలు చేపడతామని తాహసీల్దార్ శ్రీకాంత్ రోడ్లు అధికారులు హామీ ఇవ్వడంతో రిలే దీక్ష విరమణ చేశారు. మండల కేంద్రం బల్మూరు నుండి మహాదేవపూర్ వరకు మంజూరు అయిన బీటీ రోడ్డు పనులు ప్రారంభం చేసి మధ్యలో ఆపి వేయడంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పొలాలకు వెళ్లడానికి ఆటంకం కలుగుతుందని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రిలే దీక్షలు గత రెండు రోజులుగా చేయడంతో ఆర్ అండ్ బి అధికారులు ఏఈ రెవిన్యూ తాసిల్దారు రిలే దీక్ష చేస్తున్న శిబిరానికి వచ్చి మీ దీక్షను విరమణ చేయండి.. మేము 15, 20 రోజులలో రోడ్డు, ఎట్లా ఉంటే అట్లా బీటి రోడ్డు వేసేటట్టుగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో తాసిల్దారు నిమ్మరసం ఇచ్చి దీక్షలో కూర్చున్నవారికి దీక్ష విరమణ చేశారు. 

బీటీ రోడ్డు మంజూరైన రోడ్డుకు ఎవరు ఆటంకం కల్పించిన నక్ష ప్రకారం రోడ్డు వేసేటట్టుగా చర్యలు చేపడతామని తాసిల్దార్ అన్నారు. 15, 20 రోజులలో పనులు ప్రారంభం చేయకపోతే మళ్లీ పోరాటాలు చేస్తామని సీపీఐ(ఎం) నాయకులు అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి శంకర్ నాయక్ నాయకులు లాల్ మహమ్మద్  కార్మిక సంఘం జిల్లా నాయకులు మల్లేష్ రైతులు గౌస్ సుల్తాన్ బాబర్ భారిమం భారీమం దేవయ్య లక్ష్మయ్య రామస్వామి లింగస్వామి రాజు శివ నాగరాజు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -