నవతెలంగాణ – జుక్కల్
16వ విడత సామాజిక దానికి బృందం మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులతో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు ఎంపీవో రాము, ఏపీవో తులసిరాం ఈసీ స్వామి దాస్, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, సి ఓ లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన 2025 -26 సంవత్సరానికి సంబంధించిన పనులు గ్రామాల వారీగా ఒక్కొక్క లబ్ధిదారులకు సామాజిక నిర్వహించి గ్రామాలలో పనుల నాణ్యత పురోగతి అవకతవకలు గుర్తించేందుకు సామాజిక తనిఖీని నిర్వహిస్తామని తెలిపారు.
ఇందులో సామాజిక తనిఖీ వచ్చిన బృందానికి గ్రామంలో మీ అధికారులు తప్పకుండా సహకరించి తనిఖీ బృందానికి సాయ సహకారాలు అందించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా గ్రామస్థాయి అధికారులు తమ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సామాజిక తనిఖీ బృందానికి సరి అయిన లెక్కలు వాటికి సంబంధించిన రికార్డులను అధికారులకు తనకి బృందానికి చూపించాలని వారికి ఎటువంటి పాల్పడకుండా దాకారాలు చేయాలని సమావేశంలో పాల్గొన్న గ్రామస్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీవో , ఏపీవో , ఈసీ ఎఫ్ఏలు, జిపి కార్యదర్శిలు, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.




