Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

వ్యవసాయ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి

- Advertisement -

వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాద్ జిల్లా ఉపాధ్యక్షులు ఈసంపల్లి సైదులు 
నవతెలంగాణ – నెల్లికుదురు 

వ్యవసాయ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఈసంపల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలిపారు. మండలంలోని మునిగల వీడు గ్రామంలో మంగళవారం కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఇందిరమ్మ భరోసా పథకాన్ని ద్వారా  వ్యవసాయ కార్మికులకు ప్రతినెల  పెన్షన్ ఇస్తానని, కూలి బంద్ కింద 12000 చెల్లిస్తామని చెప్పారు. గ్రామపంచాయతీలో మహిళల పేర్లను నమోదు చేసుకుని వారికి ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 

ఆర్బాటంగా చేయడమే కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తి విఫలమైందని ప్రభుత్వంపై మండిపడ్డారు. మండల రెవెన్యూ అధికారులు మరియు లేబర్ డిపార్ట్మెంట్ గ్రామంలో పర్యటించి కనీస వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. వృద్ధులకు రూ.4000 పింఛన్ మరియు వికలాంగులకు రూ.6000 పెన్షన్ తక్షణమే అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వ్యవసాయ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, అన్నారు. రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మికులను వృద్ధులను వితంతులను వికలాంగులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూక్య బిక్షపతి, బండ వెంకన్న, శ్యామల, మల్లయ్య, వెంకటయ్య, కిష్టయ్య, బీలు ఎల్లయ్య, బద్రు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -