Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు

- Advertisement -

ఇబ్రహీంపట్నంలో బైక్ ర్యాలీ
ర్యాలీలో పాల్గొన్న ఏసీపీ కేపీవీ రాజు
రక్తదాన శిబిరాలు ఏర్పాటు 
విద్యార్థులకు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్
షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ కాంపిటీషన్
నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని పోలీసులు ఘన నివాళ్ళు అర్పిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో పది రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు, పలు ఇంజనీరింగ్ కళాశాల్లో విద్యార్థులు ఎస్ఏ రైటింగ్, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు పాల్గొన్నారు. ఆపద కాలంలో పోలీసులు రావాలంటే డయల్ -100కి సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, డ్రగ్స్ వాడకం వల్ల కలిగే నష్టాలు, పోక్సో చట్టం, సీసీ కెమెరాల ఉపయోగాలు వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 21 నుండి ఈ నెల వరకు 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులకి పది రోజులపాటు సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయవద్దని సూచించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ లేని వాహనాలను నడపవద్దని సూచించారు.

ముఖ్యంగా మైనర్లు వాహనాలను నడపకూడదని హెచ్చరించారు. ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు ప్రథమ చికిత్స అందించడం గురించి, అలాగే గ్రామాల్లో రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. సైబర్ నేరాల గురించి ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఎవరైనా మోసాలకు గురైనప్పుడు వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం సీఐ మహేందర్ రెడ్డి, పోలీసులు, విద్యార్థులు ఉత్సావంతంగా పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -