పీఎంజేజేవై పాలసీపై అవగాహన

– గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ వంశీ
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని దాదాపూర్‌ తెలంగాణా గ్రామీణ బ్యాంక్‌ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్‌ లావాదేవీల గురించి, సామజిక భద్రత గురించి, ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలపై, పీఎంజేజేవై పాలసీపై అవగాహ సదస్సు నిర్వహించినట్టు వంశీ తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పాలసీ కట్టుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ మోసాలకు దూరంగా ఉండాలన్నారు. అదే విదంగా వివిధ రకాల రుణ సదుపాయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంక్‌ మేనేజర్‌ వంశీ, ఫీల్డ్‌ ఆఫీసర్‌ అనిత, ఖాజారెడ్డి, క్యాషియర్‌ శ్వేత, కళాబృందం సభ్యులు పాల్గొన్నారు.

Spread the love