Wednesday, May 14, 2025
Homeరాష్ట్రీయం31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

31 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు పొడిగింపు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
లే అవుట్‌ రెగ్యులైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌) 25 శాతం రిబేట్‌, ఫీజు చెల్లింపు గడువును మే 31 వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎమ్‌ దానకిషోర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ గడువు మే 3వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ స్కీం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించిన మేర నిధులు సమకూరలేదు. దీనితో ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. తాజాగా మే 3 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక సంఘాలతో డీటీసీపీ లే అవుట్లకు కూడా 25 శాతం రిబేటు వర్తింస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌టైం సెటిల్‌మెంటును ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీనితో ఫీజులో 25 శాతం రాయితీ ఇస్తూ, మార్చి 31వరకు గడువు విధించారు. ఆ తర్వాత దాన్ని ఏప్రిల్‌ 30 వరకు, మరోసారి మే 3వ తేదీ వరకు గడువును పొడిగించారు. తాజాగా మే 31వరకు మరోసారి గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును మళ్లీ మళ్లీ పొడిగిస్తున్నట్టు సమాచారం. 2020లో ప్రారంభమైన లే అవుట్‌ క్రమబద్ధీకరణ పథకానికి 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించిన వారిలో 40 శాతం మందికి అధికారులు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. అయితే 5.19 లక్షల మంది మాత్రమే ఏప్రిల్‌ 30 నాటికి చెల్లింపులు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా రూ.20 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం ఆశించింది. అయితే ఇప్పటివరకు రూ.1,863 కోట్లు మాత్రమే వచ్చినట్టు అధికారులు తెలిపారు. దీనితో ఈ స్కీం కాలపరిమితిని పొడిగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -