Wednesday, October 29, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంకెన్యాలో కూలిన పర్యాటక విమానం

కెన్యాలో కూలిన పర్యాటక విమానం

- Advertisement -

12 మంది మృతి
నైరోబి : కెన్యాలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన విమాన ప్రమాదంలో 12 మంది మృతి చెందారు. ప్రముఖ రిజర్వ్‌ ఫారెస్టు మాసాయి మారాలోని డయాని నుంచి కిచ్వా టెంబోకు వెళ్తున్న 5వై-సిసిఎ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగిన పర్యాటక విమానం కౌంటీ క్వాలేకు సమీపంలో కూలిపోయింది. ఈ విషయాన్ని కెన్యా సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ (కేసీఏఏ) ఒక ప్రకటనలో వెల్లడించింది. విమానంలో ఉన్న మొత్తం 12 మంది మరణించినట్లు తెలిపింది. ప్రమాదానికి కారణంతో పాటు ఇతర విషయాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది. ఈ విమానం కెన్యా, మొంబాసా దేశాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల మధ్య సర్వీసులు నిర్వహించే ఒక విమానయాన సంస్థదని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -