ప్రజావాణిలో ఇన్‌చార్జి చిన్నారెడ్డికి టీజీయూఎఫ్‌ఎయూ వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామీణ ఉపాధి ఫీల్డు అసిస్టెంట్స్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూపాల్, ఎం.నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఇన్‌చార్జి డాక్టర్ జి.చిన్నారెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. వేతనాలు పెంచాలనీ, సర్క్యులరు 4779ను రద్దు చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు లేఖ రాసి పంపారు. కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు సత్యం, వెంకటేష్, వెంకట్‌నాయక్, చారి, అంజన్న, తిరుమలగిరి వెంకటయ్య, భీంసేన్, రమేష్, నాగరాజు, బాలరాజు, కురుమూర్తి పాల్గొన్నారు. అనంతరం కమిషనర్ కార్యాలయంలోనూ వారు వినతిపత్రం అందజేశారు.



