Wednesday, October 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

ప్రిసైడింగ్‌ అధికారులకు శిక్షణ

- Advertisement -

పీఓ, ఏపీఓ, ఓపిఓలు పూర్తి అవగాహనతో విధులకు వెళ్లాలి : జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి.కర్ణన్‌
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికలలో ప్రిసైడింగ్‌ అధికారులు, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులది కీలకపాత్ర అని, విధులు, బాధ్యతలపై పూర్తి అవగాహన పెంచుకుని ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌వి.కర్ణన్‌ సూచించారు. జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రిసైడింగ్‌, సహాయ ప్రిసైడింగ్‌ అధికారులకు మంగళవారం హైదరాబాద్‌ షేక్‌పేట జి.నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎన్నికల పోలీస్‌ పరిశీలకులు ఓంప్రకాశ్‌ త్రిపాఠి, వ్యయపరిశీలకులు సంజీవ్‌ కుమార్‌లాల్‌ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పీఓ, ఏపీఓలకు పోలింగ్‌ రోజు వారి విధులు, బాధ్యతలపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అదనపు కమిషనర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు.

శిక్షణ కోసం ఉపయోగించే బ్యాలెట్‌ యూనిట్‌లు, కంట్రోల్‌ యూనిట్‌లు, వివి ప్యాట్‌లతో అనుసంధాన ప్రక్రియ, మాక్‌ పోలింగ్‌, ఓటింగ్‌ జరిపే విధానంపై మాస్టర్‌ ట్రైనర్‌లు ప్రత్యక్ష అవగాహన కల్పించారు. నోటాతో కలిసి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 4 బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్‌, వీవీ ప్యాట్‌కు అనుసంధానం జాగ్రత్తగా చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పోలింగ్‌ రోజు ముఖ్యమైందని, ఎన్నికల కమిషన్‌ రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతి పీఓ, ఏపీఓ తప్పకుండా చదవడమే కాకుండా, అందులోని నిబంధనలను పాటించాలని సూచించారు. పోలింగ్‌ ముందు రోజు చేయాల్సిన పనులను చెక్‌లిస్టు తయారు చేసుకొని విధులు నిర్వహించాలని చెప్పారు. రెండు విడతలుగా జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి బాధ్యులు సునంద, మమత, 500 మందికి అధికారులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -