30న ఎస్‌ఎఫ్‌ఐ విద్యాసంస్థల బంద్‌కు డీవైఎఫ్‌ఐ మద్దతు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యారంగ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తలపెట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్, కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, ఉపాధ్యక్షులు ఎండీ జావీద్, ఆర్‌ఎల్ మూర్తి, హైదరాబాద్ నాయకులు రాజు మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రకారం రూ.1,200 కోట్లు విడుదల చేయాలని కోరారు.
రాష్ట్రంలో ఆరేండ్ల నుంచి సుమారు రూ.ఎనిమిది వేల కోట్లకుపైగా ఫీజు బకాయిలున్నాయని అన్నారు. ప్రభుత్వం ఫీజులను విడుదల చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు బలవంతంగా విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయని విమర్శించారు. ఉన్నత చదువులకు వెళ్లాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా ఫీజులు కడితేనే ధ్రువపత్రాలను ఇస్తామంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నా యన్నారు. ఫీజుల చెల్లింపు కోసం విద్యార్థులకు భరోసా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్యాశాఖను పర్యవేక్షిస్తూ విద్యార్థులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



