నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్న ఇంటర్ విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను కొత్త హంగులతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనాలకు కొత్త రంగులు వేయనున్నట్టు ప్రకటించింది. ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల భవనాలు రంగులతోనే విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తాయి. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల భవనాలు వెలిసిపోయి ఉంటాయి. వాటిని చూడగానే ప్రవేశాలు పొందాలన్న అభిప్రాయం కలగదు. అర్హులైన అధ్యాపకులున్నా అందమైన భవనాలుండవు. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీల్లో చేరడానికి మొగ్గు చూపుతారు.
దీన్ని గమనించిన ఇంటర్ విద్యాశాఖ 429 ప్రభుత్వ జూనియర్ కాలేజీల భవనాలకు రంగులు వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ సంచాలకులు ఎస్ కృష్ణ ఆదిత్య మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఒకే రకమైన రంగు వేయాలని నిర్ణయించామని తెలిపారు. తెలుపు రంగు, చివరన నీలి రంగు ఉంటుందని స్పష్టం చేశారు. మైనర్ రిపేర్ల ఫండ్ నుంచి నిధులను వినియోగించాలని పేర్కొన్నారు. జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖ అధికారులు (డీఐఈవో), నోడల్ అధికారులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు అన్ని కాలేజీలకు రంగులు వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా ఈ పనులను పూర్తి చేయాలని కోరారు.
జూనియర్ కాలేజీలకు కొత్త రంగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



