అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి ..
నవతెలంగాణ- మునుగోడు
రైతులకు ఉపయోగపడాల్సిన మార్కెట్ యార్డ్ నిబంధనలకు విరుద్ధంగా దళారు వ్యాపారులకు మునుగోడు మార్కెట్ యార్డ్ అడ్డాగా మారిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనాలకు విరుద్ధంగా దళారులకు కొమ్ముకాసే విధంగా దళారు వ్యాపారులకు మార్కెట్ యార్డును లీజుకి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు..? నిబంధనాలను ఉల్లంఘించి దళారులకు లీజుకు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి , వరి పంట సాగుచేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రెవిన్యూ వ్యవసాయ శాఖ అధికారుల తో పంట వివరాలను సేకరించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్దకు అమ్ముకునేందుకు తీసుకువచ్చిన వరి ధాన్యమును కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం ను తరవకుండా భద్రపరచుకునేందుకు పట్టాల సౌకర్యము కల్పించాలని అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిచిన మొలకొచ్చిన ప్రభుత్వమే బాధ్యత వయించి ధాన్యమును కొనుగోలు చేయాలని అన్నారు.
పండించిన వరి పత్తి పంటను అమ్ముకునేందుకు సీసీఐ, ధాన్యం కొనుగోలుకు కేంద్రాలకు వచ్చిన రైతులను తేమ , తాలు , రంగు సాకులతో రైతులను ఇబ్బంది కలిగిస్తే పెద్ద ఎత్తున రైతులతో ఉద్యమాలను చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సీసీఐ, దాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలను ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ , మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, వరికుప్పల ముత్యాలు, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, యాట యాదయ్య, పగిళ్ల మధు , ఎట్టయ్య, కొంక రాజయ్య , పగిళ్ల యాదయ్య, ఎర్ర లింగయ్య తదితరులు ఉన్నారు.



