- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కేతేపల్లి మండల పరిధిలోని మూసీ నది నిండు కుండలా మారింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు యొక్క 3, 4, 5, 6, 8, 10, 12 క్రస్ట్ గేట్లను 4 అడుగుల మేర ఎత్తినట్లు అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
- Advertisement -



