Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుండ పోత వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

కుండ పోత వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

- Advertisement -

నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ 
మొంథా తుఫాను రైతుల పాలిట శాపంగా మారింది. కల్వకుర్తి నియోజకవర్గం లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోత దశలో ఉన్న వరి పంట నేలకొరిగింది. పత్తి తీయకపోవడంతో పొలంలోనే తడిసి ముద్దయింది. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పొలాలు జాలువారి నీటిలోనే కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది. వాగులు వంకలు ఏరులై  పారడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. కల్వకుర్తి మండలం రఘుపతి పేట దుందుంబి వాగు ప్రమాదకరంగా పొంగిపొర్లుతుంది. దీంతో కల్వకుర్తి తెలకపల్లి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పంజుగుల వద్ద సవుట వారు ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రధాన రహదారిపై నీటి ఉధృతకి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

కల్వకుర్తి పట్టణంలో నీరు నిల్వ ఉన్నచోట జెసిబి ల సహాయంతో నీటిని పారదోలే ప్రయత్నం చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, కల్వకుర్తి పోలీసులు సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి తదితరులు కల్వకుర్తి పట్టణంలో ఎక్కడ మీరు నిల్వ ఉండకుండా ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -