నెల్లికుదురు విద్యుత్ ఏఈ సింధు
మునిగలవీడు సబ్ స్టేషన్ విద్యుత్ ఏ ఈ భార్గవి
నవతెలంగాణ – నెల్లికుదురు
తుఫాన్ వల్ల అతి భారీ వర్షాలు కురుస్తున్నందున మండల ప్రజలు విద్యుత్ కన్జ్యూమర్లు విద్యుత్తు పట్ల జాగ్రత్త లు పాటించాలని నెల్లికుదురు విద్యుత్ సబ్స్టేషన్ మునిగల వీడు సబ్ స్టేషన్ విద్యుత్ ఏఈ భార్గవి అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ ఒక్కొక్కసారి అనుకోకుండా ఎర్త్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని మండల ప్రజలు పలు జాగ్రత్తలు పాటించాలని కోరినట్లు తెలిపారు. కింద పడిన విద్యుత్ తీగలు లేదా లైన్‌లు ఎవరు కూడా వాటి దగ్గరకు వెళ్ళకూడదని అన్నారు. అలా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.. వర్షం కురుస్తున్న సమయంలో ట్రాన్స్‌ఫార్మర్లు లేదా విద్యుత్ స్థంబాల క్రింద ఎవరు కూడా వెళ్ళవద్దని తెలిపారు. ఇళ్లలో నీరు చేరితే ప్రధాన స్విచ్ ఆఫ్ చెస్తే ప్రమాదం నుండీ బయట పడవచ్చని అన్నారు.
తడి చేతులతో స్విచ్‌లు, ప్లగ్‌లు కాక వద్దు
పిల్లలను విద్యుత్ స్థంబాలు లేదా ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర ఆడనివ్వ వద్దని,ఇంటి పైకప్పు మీద సర్వీస్ వైర్లు సడలి వున్నాయా చెక్ చేయండి అన్నారు. మీటర్ బాక్స్, డీబీ బోర్డ్ లో నీరు చేరకుండా చూసుకోవాలని అన్నారు. వర్షం సమయంలో TV, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వాడే ముందు ప్లగ్‌లు పొడిగా ఉన్నాయా లేదని చూసుకోవాలని చెప్పారు. విద్యుత్ లైన్ పనులు జరుగుతున్న ప్రదేశానికి దూరంగా ఉండాలి.తడి బట్టలు విద్యుత్ తీగలులేదా గి వైర్ పై ఆరేయకండి. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఏదైనా ప్రమాదకర పరిస్థితి గమనిస్తే వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వండి స్వయంగా చెయ్యడానికి ప్రయత్నించవద్దు. అని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే మాకు సమాధానం ఇస్తే వెంటనే మేము మా సిబ్బంది వచ్చి సమస్య లేకుండా చూస్తామని తెలిపారు. అన్నారు.


