నవతెలంగాణ – మణుగూరు: నవంబర్ 15,16 తేదీలలో మణుగూరులో జరిగే సెంటర్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (సిఐటియు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభల జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు తెలిపారు మంగళవారం గోడ ప్రతిని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ సీఐటీయూ ఆవిర్భావం నుంచి కార్మికుల సమస్యల కోసం కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు మణుగూరు పట్టణంలో నవంబర్ 15 16 తేదీలలో మణుగూరు పట్టణంలో సిఐటియు జిల్లా మహాసభలు జరుగుతాయని తెలిపారు ఈ మహాసభల లో కార్మికుల సమస్యలను ప్రభుత్వాల, కార్మికుల వ్యతిరేకమైన చట్టాలు చేస్తున్నందున వాటిని ఎలా తిప్పి కొట్టాలనే దానిపై చర్చించుకోవడం జరుగుతుందని తెలిపారు కనీస వేతన చట్టం అమలు చేయడం లేదని,26000 ఇవ్వాలని మహిళలకు పని ప్రదేశాలలో రక్షణ కల్పించాలని అన్నారు ఈ ఆవిష్కరణలో సిఐటియు సీనియర్ నాయకులు కొడిశాలరాములు. వై సాంబయ్య . శివ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు
నవంబర్ 15, 16 మణుగూరులో సిఐటియు జిల్లా మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


