Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమంగా తరలిస్తున్న కలప వాహనం సీజ్..

అక్రమంగా తరలిస్తున్న కలప వాహనం సీజ్..

- Advertisement -
  • – అటవీ చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు..
  • – ఇందల్ వాయి రేంజ్ అధికారి రవి మోహన్ భట్..
  • నవతెలంగాణ – డిచ్ పల్లి: పొట్ట భూమి లో ఉన్న టేకు చెట్లను నరికి ఫారెస్ట్ అధికారుల నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా టాటా సుమో వాహనం లో తరలిస్తున్న టేకు కలప తరలిస్తుండగా పట్టుకుని సీజ్ చెసినట్లు ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ పేర్కొన్నారు.బుదవారం ఇందల్ వాయి రేంజ్ కార్యాలయం లో కలప కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
    • దర్పల్లి మండలంలోని ప్రాజెక్ట్ రామడుగు శివారు ప్రాంతం నుండి బుధవారం వెకువ జమున ఒక టాటా సుమో వాహనం లో పట్ట భూమి నుండి టేకు కలప చేట్లను నరికి వానంలో కనిపిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు అటల్ సిబ్బంది కాపు కాసి వానను పట్టుకోని చూడగా వాహనం లోపల టేకు దుంగలు ఉన్నట్లు నిర్ధారించుకొని వాహనాన్ని ఇందల్ వాయి రేంజ్ కార్యాలయానికి తరలించారన్నారు.
    • ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసి యజమానిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్ట భూములనుంచి ఇలాంటి అనుమతులు లేకుండా కలప ను తరలించవద్దని , ఒకవేళ కలప తరలించాలనుకుంటే ముందస్తుగా అటవీ అధికారుల అనుమతులు తప్పనిసరి తీసుకోవాలన్నారు. అటవి చట్టాలను ఒలంపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటమని,దినికోసం ప్రతి ఒక్కరు అటవీ అధికారులకు సంపూర్ణ సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు అబ్దుల్ అతిఖ్, భాస్కర్, బీట్ అధికారులు నవీన్ రాజ్, ప్రహిన్, ఉదయ్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -