నవతెలంగాణ – బజార్ హాత్నూర్: మండలంలోని దేగామా ముంపు బాధితులకు న్యాయం చేసేవిధంగా చూడాలని గతంలో జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుని కోరగా బుధవారం రెవెన్యూ అధికారులు ముంపు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. అధికారాలతో కలిసి సర్వేలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్, ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడే గజేందర్ అధికారులతో మాట్లాడుతూ పకడ్బందిగా సర్వే నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని, సర్వే ఆధారంగా బాధితులకు న్యాయం చేసేవిధంగా జిల్లా ఇంచార్జి మంత్రితో మాట్లాడుతానని ఎవరు అధైర్య పడవద్దు అని ఇది ప్రజా పాలన ప్రభుత్వం అని బాధితులకు తెలిపారు. అంతే కాకుండా మండలంలోని భూతాయి బి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బోథ్ మార్కెట్ అధ్యక్షులు బొడ్డు గంగయ్య, మండల అధ్యక్షులు జల్కే పాండురంగ్, బోథ్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పకడ్బందిగా సర్వే నిర్వహించాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



